ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మార్గదర్శనం

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు మార్గదర్శనం పాలేరు గ్రామంలో అవగాహన శిబిరం కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పంటల వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన ఆహారం...