ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫ‌స్టియ‌ర్ వార్షిక పరీక్షలు ప్రారంభ‌మ‌య్యాయి. తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా కాలేజీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్ల పరిశీలన అనంతరం విద్యార్థులను పరీక్షా గదుల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.