జోలెలోనే దవాఖానకు..
జోలెలోనే దవాఖానకు.. వలస కూలీల కష్టాలు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా (నూగురు) వెంకటాపురం మండలం పరిధిలో వలస కూలీల దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. పని కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఓ వలస కూలీ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. సహచర కూలీలు అతడిని సుమారు రెండు కిలోమీటర్ల మేర ఒక కర్రకు జోలకట్టి మోస్తూ మండలకేంద్రంలోని బస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్సు సర్వీస్ కు ఫోన్ చేశారు....