వట్టివాగు పనులు నత్తనడకనెందుకు?
వట్టివాగు పనులు నత్తనడకనెందుకు? ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన రేగా కాంతారావు కాకతీయ, మణుగూరు: రైతులకు ఉపయోగపడే వట్టివాగు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు. బుధవారం కరకగూడెం ఏజెన్సీ మండలంలోని చొప్పాల గ్రామపంచాయితీ పరిధి గొడుగుబండ సమీపంలో ప్రాజెక్టు పనులను ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. రైతులు రెండు పంటలు పండించే లక్ష్యంతో గత ప్రభుత్వం తన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పనుల పురోగతిని సమీక్షించిన...