ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణ కాకతీయ, మణుగూరు: మణుగూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సీఐతో కలిసి కేంద్రాలను సందర్శించిన ఆయన పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా అనే అంశంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని,...