విద్యార్థి ఆరోగ్యంపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థి ఆరోగ్యంపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించిన రాందాస్ నాయక్ మెరుగైన చికిత్సకు వైద్యులకు సూచనలు కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలం చీమలపాడు ఏకలవ్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అపెండిసైటిస్‌తో ఖమ్మంలోని ఇండస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అక్కడికి చేరుకుని పరామర్శించారు. విద్యార్థిని అప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, వైద్యులతో సమావేశమై ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. “విద్యార్థికి ఎటువంటి లోటు లేకుండా ఉత్తమ వైద్య...