ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధర్మపురి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఈనెల 27 నుంచి మార్చి 11 వరకు వేడుకలు తొలి రోజు అంకురార్పణతో షురూ.. కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 11 వరకు పదమూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వాహన సేవలు, డోలోత్సవాలు, రథోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత...