ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు
ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి నుంచే హాల్ స్లాట్ రిజర్వేషన్ సౌకర్యం కాకతీయ, హైదరాబాద్ : చారిత్రక రవీంద్రభారతిలో కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే వారికి ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై హాల్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు....