మార్చి 2న శ్రీవారి కళ్యాణోత్సవం

మార్చి 2న శ్రీవారి కళ్యాణోత్సవం ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు దాతలు, భక్తులకు దేవదాయ శాఖ పిలుపు కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 2న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆహ్వాన బ్రోచర్‌ను గురువారం ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ), దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్. సమత, ఈఓ వేణుగోపాలచార్యులు పాల్గొన్నారు....