గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు
గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి సర్పంచులకు అడిషనల్ కమిషనర్ మధులత దిశానిర్దేశం డీపీఆర్‌సీలో ముగిసిన శిక్షణా తరగతులు కాకతీయ, కారేపల్లి: గ్రామ పంచాయతీలే అభివృద్ధికి పట్టుకొమ్మలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ మధులత పిలుపునిచ్చారు. నగరంలోని డీపీఆర్‌సీ సెంటర్‌లో సింగరేణి మండలానికి చెందిన 41 గ్రామ పంచాయతీల సర్పంచులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు ఆమె స్వయంగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు....