ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది ‘ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ విక్సిత్ భారత్’ థీమ్‌కు అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర రంగంలో మహిళల పాత్ర, వారి కృషిపై ప్రసంగించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సభాధ్యక్షులు డాక్టర్ అడవి రాజు...