లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం, శానిటేషన్, సురక్షిత త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు...