ఘనంగా సైన్స్ దినోత్సవం
ఘనంగా సైన్స్ దినోత్సవం కాకతీయ, గీసుగొండ: సైన్స్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని ప్రగతి హైస్కూల్ కరస్పాండెంట్ చింతం శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని మచ్చాపూరం ప్రగతి హై స్కూల్‌లో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మొత్తం 110 సైన్స్ ఎగ్జిబిట్లను అత్యంత ఉత్సాహంతో ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త,...