పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ సూచించారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహంతో కలిసి శ‌నివారం గంగాధర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్‌లో అమలులో ఉన్న 5ఎస్ విధానాన్ని పరిశీలించి...