50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్‌ను క్లీన్ డివిజన్‌గా మార్చి ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. చెత్త సేకరణ కోసం 50వ డివిజన్‌కు నూతన ట్రాక్టర్ కేటాయించిన సందర్భంగా శనివారం ఆయన వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ట్రాక్టర్ కేటాయించిన నగర మేయర్, మున్సిపల్ కమిషనర్‌కు ఆయన ధన్యవాదాలు...