అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం
అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్ ప్రయత్నంలో గోతిలో పడిన వాహనం మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కాకతీయ/చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి రహదారి పక్కనున్న గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు....