విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం దేవుని తండాలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ భూక్యా మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం చందుర్తి మండల విద్యుత్ శాఖ ఏఈ మహేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తండాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులకు సంబంధించి కొత్త డిపిఆర్ సిద్ధం చేయాలని కోరారు....