మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్

మల్కాజిగిరిలో హెల్మెట్ అవగాహన డ్రైవ్ కాకతీయ, మేడ్చల్–మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురి ప్రాంతంలో సోమవారం ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవినాష్ మహంతి సూచనల మేరకు రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైడర్లను పోలీసులు ఆపి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరించారు. అనంతరం ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలికంగా హెల్మెట్‌లు అందజేశారు. సాయంత్రం...