సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి
సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: హోళీ పండుగను ప్రశాంత వాతావరణంలో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా సహజసిద్ధమైన రంగులనే ఉపయోగించాలని, హానికర రసాయనిక రంగులను వాడరాదని సూచించారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించకూడదన్నారు. ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు...