సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి 28న గంగాధర తిరుపతి అనే వ్యక్తి తన ఒప్పో మొబైల్ ఫోన్‌ను తీగల గుట్టపల్లిలో పోగొట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ (సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ) సాంకేతికతను వినియోగించి ఫోన్‌ను ట్రేస్ చేయగా, అది జగిత్యాలలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఫోన్‌ను సంబంధిత యజమాని తిరుపతికి అప్పగించారు.