విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా దీర్ఘకాలం విశిష్ట సేవలు అందించిన అంకుబాబు పదవీవిరమణ పొందిన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంకుబాబు సేవా కాలమంతా కర్తవ్యనిబద్ధత, నిష్పాక్షికత, నిజాయితీతో విధులు నిర్వహించి మండల పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, కార్యాలయ వ్యవహారాల్లో పారదర్శకత పాటించడం వంటి అంశాల్లో ఆయన...