కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్
కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు దెబ్బతిని, చేతిలో పనిలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ పథకం ఆశాకిరణంగా మారింది. సింగరేణి మండలం పరిధిలోని దుబ్బ తండా గ్రామపంచాయతీలో సోమవారం ఉపాధి పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. స్థానిక సర్పంచ్ ఆంగోత్ మత్రు స్వయంగా పార పట్టి మట్టి తీస్తూ పనులను ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అదును తప్పిన వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో పత్తి, మిర్చి పంటలు నష్టపోయాయి....