మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ
మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో కలిసి మెనూ ప్రకారం అన్నం, కూరలు సిద్ధం చేశారా? నాణ్యత ఎలా ఉంది? అన్న అంశాలను సవివరంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి, పరిమాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వంటశాల పరిశుభ్రతను...