విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్
విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్ సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం నరేందర్ కాకతీయ, నెల్లికుదురు: మారుమూల ప్రాంతాల నుండి పాఠశాలకు రాకపోకలలో ఇబ్బందులు పడుతున్న మండలంలోని పార్వతమ్మ గూడెం విద్యార్థుల సౌకర్యార్థం ఒక (వాన్) వాహనాన్ని లైబ్రేరియన్ భూక్యా వెంకన్న సోమవారం దాతృత్వంగా సమకూర్చడం విద్యార్థులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనం అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల విద్యార్థులు సమయానికి పాఠశాలకు హాజరవుతూ, విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యంగా మారుమూల గ్రామాల...