అడవులను రక్షించాలి
అడవులను రక్షించాలి వన్యప్రాణులను కాపాడుకోవాలి ఫారెస్ట్ అధికారుల బైక్ ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏటూరునాగారం బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం, అడవుల్లో నివసించే వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఔషధ మొక్కలు మానవాళికి అమూల్యమైన వరమని,...