శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు…
శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు... ◆యాగశాల నిర్మాణం పూర్తి ◆రథోత్సవంతో వైభవంగా ఉత్సవాలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న శివకళ్యాణ మహోత్సవాల కోసం ఆలయ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా వేలాదిమంది భక్తులను ఆకర్షించే ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఆలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక యాగశాలను నిర్మించారు. యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాలు, ప్రత్యేక పూజలు...