రంగేసి.. చిందేసి..

రంగేసి.. చిందేసి.. * అంబరాన్నంటిన హోలీ సంబురాలు * రంగుల్లో మునిగితేలిన కాకతీయ,చేర్యాల: చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువతీ యువకులు, విద్యార్థులు రంగుల పొట్లాలతో వీధుల్లో సంచరిస్తూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ రంగునీళ్లు చల్లు కుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గంతులు వేశారు. హోలీ.. హోలీల రంగ హోలీ.. అంటూ చిందులు కూడా వేశారు. చేర్యాల పట్టణంలోని గల్లీలు రంగుల మాయంగా మారాయి. రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ...