అంబులెన్స్ సేవలు తక్షణం అందేలా చూడాలి
అంబులెన్స్ సేవలు తక్షణం అందేలా చూడాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ కాకతీయ, కొత్తగూడెం: జిల్లాలో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా నిర్వహించి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సేవలు అందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. బుధవారం జిల్లా కార్యాలయంలో 102, 108 అంబులెన్స్ వాహనాల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సురక్షిత...