కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు

కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సంద‌డి కాకతీయ, నర్సంపేట టౌన్ : గీసుకొండ మండలం కొమ్మాలలో జరిగే శ్రీలక్ష్మీ నరసింహస్వామి జాతరను పురస్కరించుకొని నర్సంపేట నియోజకవర్గం నుండి వందలాదిగా కదిలిన కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ ఘనంగా ప్రారంభించారు. భాజాభజంత్రీల నడుమ, కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రభ బండ్లు జాతర వైపు ప్రయాణమయ్యాయి....