డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!
డ్రెనేజీలోనే తాగునీటి పైపులు! కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం పట్టించుకోని అధికారులు కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగరంలోని కాశీబుగ్గ ఏరియాలో డ్రెనేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా చేపడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ పనులు కూడా పూర్తిస్థాయిలో చేపట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అసంపూర్తి నిర్మాణంతో వరద నీటి ముంపు సమస్య ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పనులు కూడా నెమ్మదిగా చేపడుతున్నారని, మురికి కాలువలోనే మంచినీటి పైపులైన్ తేలుతుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. పైపు పగిలితే మురికి నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుందా? అని సందేహాలు...