కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం కాకతీయ, హుజురాబాద్ : కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం బుధవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుల్లూరి శోభారాణి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ ఇనుగాలా రాజు, వార్డ్ సభ్యులు శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ పశువైద్యాధికారి డా. ప్లవన్ మజందర్ మాట్లాడుతూ, లింగ నిర్దారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేపడితే ఆడ దూడలు పుట్టే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులు ఈ...