ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుండే వయోభేదం లేకుండా పిల్లలు యువతీ యువకులు వృద్ధులు, మహిళలు సైతం రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల ప్రధాన కూడళ్ల‌లో కామ దాహం జరిపారు. సాయంత్రం సమీపంలోని ఆలయాలకు కుటుంబ సమేతంగా చేరుకొని పూజలు నిర్వహించారు.