అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు
అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను పురస్కరించుకొని నేరేడ్‌మెట్ ఓల్డ్ పీఎస్ పరిధిలోని అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆవరణలో రంగుల సంబరాలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సెంటర్ నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది కలిసి పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు గిరి గడ్డమీది మాట్లాడుతూ.. హోలీ పండుగ ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వర్ణ, మత భేదాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి పండుగలను...