మూగజీవాలు నీరు తాగేదెలా?
మూగజీవాలు నీరు తాగేదెలా? కాకతీయ, శంకరపట్నం: మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో మూగజీవాల దాహార్తి సమస్య తీవ్రరూపం దాల్చింది. గ్రామంలోని తడి చెత్త, పొడి చెత్త కాంపౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టె నిరుపయోగంగా మారడంతో పశువులకు తాగునీటి సమస్య తలెత్తింది. తొట్టె చుట్టూ చెట్లు ఏపుగా పెరిగి, శుభ్రత లేక పూర్తిగా నిర్వీర్యంగా తయారైంది. అదేవిధంగా నీటి సరఫరా నిలిపివేయడంతో పశువులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పశుకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలు...