రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ సముద్రం కట్టపై రహదారి పనులను వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండీ అబ్దుల్ రషీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొండ సముద్రాన్ని మినీ ట్యాంక్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తూ కొండ సముద్రం కట్ట పైభాగంలో ఉన్న ప్రధాన రహదారిని తొలగించి, ఇప్పటి వరకు మరమ్మత్తులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, ప్రణాళికా లోపాలు, నిర్లక్ష్య...