అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం
అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం అయిందని తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభ బండ్ల ర్యాలీ, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణపై ముందస్తు ప్రణాళికతో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.జిల్లా కలెక్టర్, వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్గదర్శకత్వంలో పోలీసులు పకడ్బందీగా...