ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్ గ్రౌండ్ నుండి ఖిలా వరంగల్ తూర్పు కోటకు వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ స్థంబాలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో ఒక విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనగా, మరో రెండు స్తంభాలు కూడా ఒరిగి ఉండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఈ దారిలో పెద్ద సంఖ్యలో వాహనాలు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు పడతాయో అనే...