గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి
గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై చర్చ కాకతీయ, కొత్తగూడెం : గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండా గ్రామపంచాయతీలో గురువారం సర్పంచ్ ఆధ్వర్యంలో సాధారణ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో గ్రామంలోని పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి...