కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న తిరుపతిగా ఖ్యాతిగాంచిన శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి నిర్వహించిన ఈమహోత్సవాన్ని ప్రధాన అర్చకులు పరశురాం నందనాచార్యులు, రామాచార్యులు, పవనాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా గ్రామంలో ఇంటింటా తలంబ్రాల బియ్యం సేకరించి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి...