గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు రెండు లక్షల జరిమానా విధించిన కోర్టు కాకతీయ, రఘునాథపాలెం: గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021 ఏప్రిల్ 7న రఘునాథపాలెం పోలీసులు వెంకటాపాలెం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా...