వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం
వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 205 మంది ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకటాపూర్ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్. శ్రీకాంత్ తెలిపారు. శిబిరంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. స్త్రీల...