కొమ్మాల జాతరలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు…
కొమ్మాల జాతరలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు... కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర నాల్గవ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో జాతర ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చకచక సాగుతున్నాయి.భక్తుల రాకపోకలు అధికంగా ఉండటంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడు తున్నారు.జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు పెరగకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మంచినీటి ట్యాంకులు, త్రాగునీటి సరఫరా కేంద్రాల వద్ద అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు.చికెన్, మాంసం విక్రయశాలల...