పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు
పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు చందుర్తి ఎస్సై రమేష్ కాకతీయ, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి నివేదిక కార్యక్రమం సందర్భంగా చందుర్తిలో చోటుచేసుకున్న పరిణామాలపై స్థానిక పోలీసులు స్పష్టతనిచ్చారు. పోలీసులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను చందుర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం, వ్యక్తిగత పబ్లిసిటీ కోసం పోలీసు వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చందుర్తి...