నారాయణలో టర్మ్ –2 ఎస్‌ఎల్‌సి
నారాయణలో టర్మ్ –2 ఎస్‌ఎల్‌సి విద్యార్థుల నేతృత్వంలో సమావేశం కాకతీయ, జనగామ: జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో టర్మ్ – రెండు ఎస్‌ఎల్‌సి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఈ-కిడ్స్ ఆర్ అండ్ డి సంగీత, జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీత మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు తమ నేతృత్వంలో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ విద్యా పురోగతి, పాఠశాలలో నేర్చుకున్న...