లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చొప్పదండిలో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు మృతిచెందారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన చిలుక ప్రదీప్ కుమార్, తాటికొండ సాయి కిరణ్ బైక్‌పై ప్రయాణిస్తుండగా చాకుంట ఎక్స్‌రోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తీవ్రతతో వారి తలలు నుజ్జునుజ్జు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో...