ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి
ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత కాకతీయ, సిరిసిల్ల టౌన్: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం కింద జిల్లాలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత సూచించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక...