గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇటీవల జరిగిన విద్యార్థి దాడి ఘటన, విద్యార్థి అదృశ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాసంస్థలుగా ఉండాలని, కానీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. విద్యార్థులకు మానసిక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రత...