జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకరణ
జలమండలి మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి బాధ్యతల స్వీకరణ కాకతీయ, మేడ్చల్ మల్కాజిగిరి : జలమండలి మౌలాలి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్ కాకతీయ నగర్ సెక్షన్ మేనేజర్‌గా అలేఖ్య రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. మౌలాలి సర్కిల్ డీజీఎం విద్యాసాగర్ సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. గతంలో రాధిక డివిజన్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహించిన అలేఖ్య రెడ్డి బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్మికులు, సిబ్బంది ఆమెకు పూలమాలలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేస్తూ...