అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన

అగ్ని ప్ర‌మాదాలపై అవగాహన కాకతీయ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీవివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కరస్పాండెంట్ పెండ్యాల ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా ఫైర్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో అగ్నిమాపక ప్ర‌మాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు ఎలక్ట్రికల్ పరికారాలను జాగ్రత్తగా వాడాలని, గ్యాస్ సిలిండర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. అగ్నిమాప‌క పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని, ఏదైనా విపత్తు జరిగినప్పుడు...