మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

మెడికల్ స్టోర్‌లో అగ్ని ప్రమాదం జమ్మికుంట, కాకతీయ: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలోని శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్‌లో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్ లో మంటలు చెలరేగి మెడికల్ స్టోర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో యజమాని జడల పండరి అందుబాటులో లేకపోవడం వల్ల స్థానికులు షాప్ తెరిచి ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. మందులు, ఫ‌ర్నిచ‌ర్‌ చాలా వరకు దగ్ధం కాగా మిగతావి పనికిరాకుండా పోయాయ‌ని తెలిపారు.